బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన 85 ఏళ్ల అనసూయ వృద్ధాప్యంతో బుధవారం మరణించారు. జనహిత సేవా సమితి సభ్యులు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించగా, కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్లు ఆమె నేత్రాలను సేకరించారు. ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన అనసూయ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.