నెన్నెల: గుడుంబా తయారీదారుడిపై కేసు

52చూసినవారు
నెన్నెల: గుడుంబా తయారీదారుడిపై కేసు
నెన్నెల మండలంలోని పెద్ద లంబాడి తండా శివారులోని మామిడి తోటలో గుడుంబా తయారు చేస్తున్న కన్నెపల్లి మండలం వీగాం గ్రామానికి చెందిన బుర్స మారయ్యపై కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్సై ప్రసాద్ తెలిపారు. ‌మారయ్య మామిడి తోటలో నిత్యం నాటు సారా తయారు చేస్తూ విక్రయించేవాడు. దాడులు నిర్వహించగా 15 లీటర్ల నాటు సారా లభ్యమైనట్లు తెలిపారు. గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

సంబంధిత పోస్ట్