నెన్నెల మండలంలోని మైలారంలో బర్ల బుచ్చయ్య (71) వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు లేకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. ఈనెల 23న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కొత్తూరులో వెంగన్న పెద్ద చెరువు కట్ట కింద ఉపాధి కూలీలకు మృతదేహం కనిపించడంతో సర్పంచ్ తలండి రాజేశ్వరి, ఉపసర్పంచ్ బోయిని పోషమల్లుకు సమాచారం అందించారు. ఎండలకు అడవిలో తిరగడం ద్వారా వడదెబ్బ తగిలి మృతి చెందాడని మృతుని సోదరుడి కుమారులు తెలిపారు.