దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ఆదివారం నెన్నెలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సాధారణ కుటుంబం నుంచి మహోన్నత వ్యక్తిగా ఎదిగిన కాకా వెంకటస్వామి, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని నాయకులు కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.