బీజేపీ మహిళా నాయకురాలు సంగీత ఆధ్వర్యంలో నెన్నెల మండలం మైలారం గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజలకు భోజన ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి తోడుగా ఉండటం తమ బాధ్యత అని సంగీత పేర్కొన్నారు. మోడీ క్యాంటీన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.