గొల్లపల్లి రైతులు 20 రోజుల క్రితం తేమ శాతం చూసి కాంట వేసిన ధాన్యం బస్తాలను మళ్లీ తేమ
పరీక్షలు నిర్వహించి తూకం వేయాలని డిసిఎంఎస్ నిర్వాహకుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తాసిల్దార్ కార్యాలయానికి వచ్చారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తాసిల్దార్ శ్రీనివాస్ ఎదుట ఉంచి తేమశాతం పరీక్షించాలని, కావాలనే గోస పెడుతున్నారని రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం తరలింపు నిలిచిపోయింది.