
నేరుగా గ్యాస్ సిలిండర్ల అమ్మకాలపై ఢిల్లీలో నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీలు, గిడ్డంగుల నుంచి వినియోగదారులకు నేరుగా సిలిండర్లు విక్రయించడాన్ని సీఎం రేఖా గుప్తా పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుక్ చేసుకున్న సిలిండర్లు నేరుగా ఇళ్లకే చేరుతున్నాయని, ప్రజలు గ్యాస్ గోడౌన్ల వద్ద గుంపులుగా చేరవద్దని సూచించారు. వలస కార్మికుల కోసం 5 కేజీల చిన్న సిలిండర్ల సరఫరాను పెంచారు. సిలిండర్ల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.




