బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంకాం కోర్సులలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ 1వ తేదీలోపు చేసుకోవాలని ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈ కోర్సులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని, 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీజీలో ప్రవేశం పొందాలనుకునే టీజీ సిపి గెట్-2025 రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, ఉత్తీర్ణులు కాని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.