బెల్లంపల్లి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి

1631చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. బెల్లంపల్లి ప్రజావాణిలో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణానికి పిల్లర్లు వేయగా కొంతమంది అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అధికారులు పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్