మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండల కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ గడ్డల జయలక్ష్మి వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కల మందును వేశారు. పోలియో రహిత దేశంగా అభివృద్ధి చెందడానికి గ్రామ ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఎస్ఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.