
భర్తగా, తండ్రిగా ఓడిపోయా! పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న సివిల్ ఇంజనీర్
స్టాక్ మార్కెట్ నష్టాలు, రూ.36 లక్షల అప్పుల కారణంగా విశాఖలో షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ చల్లగుండ్ల హర్షవర్ధన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. తాను కొడుకుగా, తండ్రిగా, భర్తగా విఫలమయ్యానని భార్యకు సందేశం పంపి, దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద జన్మభూమి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందులే కారణమని తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని బొమ్మసముద్రంకు చెందినవారు.




