గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బెల్లంపల్లి పట్టణంలోని గాంధీనగర్ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతినగా, బైక్ పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించి, గాయపడిన వ్యక్తిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.