బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వ్యాపారుల ఆందోళన

4చూసినవారు
బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వ్యాపారుల ఆందోళన
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు రెండోరోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాంటా చౌరస్తాలో పొక్లెయిన్లతో నిర్మాణాలను తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. తమకు ఆధారం చూపిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని, లేదంటే రోడ్డున పడతామని వ్యాపారస్తులు ధర్నా చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ఏసీపీ, సీఐల పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.