తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మద్దిబోయిన శంకర్ ను నియమిస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నియామకంపై నూతన అధ్యక్షుడు శంకర్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా అధ్యక్షుడు రఘునాత్ రెడ్డి, మరియు మండల సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.