
మరో వీడియో విడుదల చేసిన ‘రైల్వేకోడూరు’ మహిళ
AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆదివారం మరో వీడియోను విడుదల చేశారు. ‘రైల్వేకోడూరు జనసేన పార్టీకి తాతంశెట్టి నాగేంద్ర అనే బ్రోకర్ ఉన్నారు. రాజకీయాలు వద్దు.. జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడమని మొదటి నుంచి చెబుతున్నా. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నందుకు కాదు.. నన్ను ప్రేమించాడు కాబట్టే ఎమ్మెల్యే శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని అన్నాడు. శ్రీధర్ ఏంటో నాకు తెలుసు.. అతడిని బ్యాడ్ చేయకండి’ అని మహిళ వీడియోలో తెలిపారు.




