మంచిర్యాల జిల్లాలో నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పత్తి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం తాండూరు మండలంలోని పలు జిన్నింగ్ మిల్లులను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేటప్పుడు నిబంధనల ప్రకారం తేమశాతం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.