తాండూరు: పేదవాడి ఆకలి తీర్చిన ఇందిరా గాంధీ

3చూసినవారు
తాండూరు: పేదవాడి ఆకలి తీర్చిన ఇందిరా గాంధీ
తాండూరు మాజీ సర్పంచి సల్వాజి ఉమారాణి, మాజీ జెడ్పిటిసి సాలిగం లక్ష్మి బాణయ్య, మాజీ ఎంపీపీ మాస సరితా వెంకటస్వామి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమారాణి మాట్లాడుతూ, 'గరిబీ హఠావో' నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని అన్నారు. హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై కృషి చేసిన దేశ మొదటి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ అని కొనియాడారు. పేదలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ తోనే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్