తాండూర్: ఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

68చూసినవారు
తాండూర్: ఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు
తాండూరు మండలంలో బుధవారం హిందువహిని, ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిష్టంపేట ఆంజనేయ స్వామి ఆలయం నుండి బుధవారం మార్కెట్ మీదుగా ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్