నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం తాండూర్ లో మహాసభల గోడప్రతులను విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా లేబర్ కోడ్స్ అమలు చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.