తాండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మల్లేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని పాఠశాలల హెచ్ఎంలు, శానిటేషన్ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్యకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోషణ ప్రాముఖ్యత, పచ్చదనం, పరిశుభ్రత గురించి రిసార్ట్స్ పర్సన్స్ శ్రీనివాస్, ఉమాదేవి, సంపత్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు శ్రీనివాస్, ప్రదీప్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.