జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం 400వ రోజుకు చేరుకున్న అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి అభినందించారు. పేదల ఆకలి తీర్చడం అద్భుతమని, రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమితి సేవలను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.