ఈ సెట్ లో బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

ఈ సెట్ ప్రవేశపరీక్షలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ఒకటవ, రెండవ, ఐదవ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ తెలిపారు. ఈ విజయంతో కళాశాల ఖ్యాతి రాష్ట్రస్థాయికి విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.
