రెండు బైకులపై గుడుంబా తరలిస్తున్న బానోత్ ఆనంద్, ధరావత్ రాజులపై కేసు నమోదు చేసినట్లు నిల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ శనివారం తెలిపారు. వేమనపల్లి మండలం మంగనపల్లి, రాజారం, వేమనపల్లి గ్రామాలకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై మంగనపల్లి సమీప అటవి ప్రాంతంలో ఆ బైకులను ఆపి తనిఖీ చేయగా గుడుంబా లభ్యమైంది. ఇద్దరి వద్ద నుంచి 100 లీ. గుడుంబా ప్యాకెట్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.