వేమనపల్లి మండలంలోని జిల్లెడ గ్రామంలో ఆదివాసీలు నివసించే కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు భాగాల రాజన్న అధికారులపై మండిపడ్డారు. ఒక్కవైపు ఎండలు మండిపోతున్న ఎండలకు నీటిని కొనుకొని చేసి త్రాగుతున్నారని, నీళ్ళ కోసం అల్లాడిపోతున్న ప్రభుత్వం, అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులు వెంటనే జిల్లెడ ఎస్టీ వాడలో మంచి నీటి బోరు వేయించి త్రాగునీరు అందించే విధంగా చూడాలన్నారు.