వేమనపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన సుభిక్షంగా సాగిందని పేర్కొన్నారు. నాయకులు జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.