రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భీమారం మండలం పొలంపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం సేకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తూ రైతుల నుండి వరి ధాన్యాన్ని సేకరిస్తోందని కలెక్టర్ వివరించారు.