జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మండలం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.