నిర్లక్ష్యంగా టిప్పర్ నడిపి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన డ్రైవర్ అంజయ్యకు కోర్టు 42 నెలల జైలు శిక్ష విధించింది. 2019 జనవరిలో కాసిపేట మండలం దుబ్బగూడెం వద్ద రాజ భూషణ్ ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని అంజయ్య తన టిప్పర్‌తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రాజ భూషణ్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. కేసును విచారించిన న్యాయమూర్తి రవి, నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు.