చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అసత్య ప్రచారం చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. మంగళవారం స్థానికంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంటలు నష్టపోయిన రైతులను ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.