చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా ప్రబలి చికిత్స పొందుతున్న రోగులను శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పరామర్శించారు.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులకు ఆయన సూచించారు. మున్సిపాలిటీలో నీరు కలుషితం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆయనతోపాటు చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.