గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం చెన్నూరు మండలంలోని బాబురావు పేట ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ జూన్ 6 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత ఏడాది 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.