స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం చెన్నూరు పట్టణంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చేయకూడని, చేయాల్సిన పనులపై సమగ్రంగా వివరించారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని సూచనలు జారీ చేశారు.