చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూర్, క్యాతన్ పెల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని 18 వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.