తెలంగాణలో పెరిగిన జనాభా ఆధారంగా ఎస్సీలకు 20% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏర్పడిన ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితికి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా సుందిళ్ల సతీష్ ను నియమించారు. వేలాల గ్రామానికి చెందిన సతీష్ నియామకాన్ని తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెడమర్తి రవి ప్రకటించారు. ఈ నియామకం ఉద్యమకారుల సంఘం, తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది.