
విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఏడాదిగా లైంగిక వేధింపులు
AP: విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న సమత కాలేజీ విద్యార్థి సాయితేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది కాలంగా సాయితేజను ఇద్దరు మహిళా లెక్చరర్లు వేధింపులకు గురి చేసినట్లు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఒక లెక్చరర్.. ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడం లేదు. నిన్ను కలవాలని ఉంది. నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా. శివాజీ పార్క్‌కి వస్తావా’ అంటూ మెసేజ్‌లు పంపేదని, తరచూ కాల్స్, మెసేజ్‌లో వేధించేదని సాయితేజ స్నేహితులు తెలిపారు.




