చెన్నూర్ లో కురిసిన భారీ వర్షాలు: వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం

1చూసినవారు
చెన్నూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో పత్తి పంట నష్టపోయింది. వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని BRS పార్టీ మంత్రి వివేక్ వెంకటస్వామిని, అధికారులను డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్