సింగరేణి బాలికల కళాశాలలో హెచ్ఐవిపై అవగాహన సదస్సు

389చూసినవారు
సింగరేణి బాలికల కళాశాలలో హెచ్ఐవిపై అవగాహన సదస్సు
మందమర్రిలోని సింగరేణి బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. కళాశాల కరెస్పాండెంట్ హీరాలాల్, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెచ్ఐవి సోకిన వారితో మాట్లాడవచ్చని, ఇది అంటువ్యాధి కాదని, రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని వారు సూచించారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు, ఒకే సూదిని వాడటం, గర్భిణుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్