జర్మనీ, జపాన్‌లలో నర్సులకు భారీ డిమాండ్ ఉందని, అక్కడ రూ.2 లక్షల వరకు జీతం వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ తెలిపారు. జర్మనీ అవకాశాలపై అధ్యయనం కోసం ఒక బృందం సిద్ధమైంది. అయితే, యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ.90 కోట్ల నిధులను కేటాయించినట్లు మంత్రి వివేక్ తెలిపారు.