గోదావరిఖనికి చెందిన స్విచ్ గేర్ ఆపరేటర్ కుడుక శ్రీనివాస్, జైపూర్ విద్యుత్ కేంద్రంలోని ఏ హెచ్ పి వద్ద విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ చేపడుతున్న పవర్ మేక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్టులో హాష్ హ్యాండ్లింగ్ మాడ్యూల్ ఆఫ్ చేసి పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్లాష్ అవుట్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ముఖానికి మంటలు అంటుకొని గాయాలయ్యాయి. వెంటనే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.