శుక్రవారం కాసిపేట 1 గనిలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన హాలర్ ఆపరేటర్ జాడి శంకర్ ను గని అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. గని మేనేజర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, శంకర్ 40 సంవత్సరాలు సింగరేణిలో సుదీర్ఘ సేవలు అందించి, క్రమశిక్షణతో ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. ఆయన గనిలో ప్రమాదాలకు గురి కాకుండా విధులు నిర్వర్తించారు.