క్యాతన్ పల్లి పట్టణంలోని ఓ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పలు ప్రాజెక్ట్ వర్క్స్ ను ప్రదర్శించారు. వాటి పనితీరును తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల మనోవికాసానికి సైన్స్ ఫెయిర్ లు ఎంతగానో దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్రంపై వారికున్న ఆసక్తి వెల్లడయ్యాయి.