అర్జునగుట్టలో గుడుంబా తయారీపై కోటపల్లి పోలీసుల దాడి

0చూసినవారు
అర్జునగుట్టలో గుడుంబా తయారీపై కోటపల్లి పోలీసుల దాడి
కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట గ్రామంలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 35 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని కూడా సీజ్ చేసి, ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :