క్యాతన్ పల్లి: ఘనంగా హోలీ వేడుకలు

2చూసినవారు
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. హోలీని ప్రేమ, వసంత కాలపు హిందూ పండుగగా, చెడుపై మంచి సాధించిన విజయంగా పేర్కొన్నారు. ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ, సంగీత నృత్యాలతో ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.

ట్యాగ్స్ :