క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి మాట్లాడుతూ, అర్హులైన నిరుపేద ప్రజలందరికీ రెండో విడతలో తప్పనిసరిగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభకు హాజరై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని తక్షణమే పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ వార్డు సభలను నిర్వహిస్తోందని ఆమె స్పష్టం చేశారు.