మందమర్రి మండలం మామిడిగట్టు పంచాయతీలో ట్రాక్టర్ వెనుక భాగం హైడ్రాలిక్ ఫీడల్ చోరీపై సోమవారం పోలీసులు డప్పు చాటింపుతో హెచ్చరిక చేశారు. గతంలో ఇలాగే పైపుల చోరీ జరిగినప్పుడు కూడా డప్పు చాటింపు చేసి, తెల్లారేసరికి పైపులు తిరిగి ఇవ్వకుంటే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో దొంగలు వాటిని అక్కడే వదిలి వెళ్లారు. ప్రస్తుతం అదే పద్ధతిలో డప్పు చాటింపు చేయడంతో రేపటి వరకు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.