మందమర్రి జివిటిసిలో గురువారం సైబర్ నేరాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఏరియా సేఫ్టీ అధికారి భూ శంకరయ్య, కార్పొరేట్ డివైజియం శ్రీనివాసరావు మాట్లాడుతూ, సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. మినిస్ట్రీ ఆఫ్ కోర్ ఆదేశాల మేరకు అక్టోబర్ నెలను నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవగాహన నెలగా ప్రకటించారని, గనులపై కార్మికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్నాయని వారు గుర్తు చేశారు.