మంచిర్యాల డిసిపి భాస్కర్, మందమర్రి పట్టణంలోని యాపా ఏరియాలో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, రోడ్డు, రవాణా, సింగరేణి అధికారుల సమన్వయంతో నిర్వహించారు.