బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చి, వివరాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.