భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. గురువారం మందమర్రిలో ముగింపు ఉత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఐ నాయకులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది అమరులయ్యారని, కార్మిక, కర్షక ఉద్యమాలు చేసి పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతులయ్యారని కొనియాడారు.