మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో ఉన్న గౌసియా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి మున్సిపల్ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. సెంటర్‌ను తనిఖీ చేయగా, అక్కడ పరిశుభ్రత లోపించిందని, నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు. హోటళ్లలో నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.